తెలంగాణలో ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా నాటకం ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు. సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్కుల భరతం పట్టండని, పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని నిరుపేదల ఇళ్లు కూల్చి బడా బాబులవి కూల్చకపోవడంపై ప్రశ్నిస్తున్నామన్నారు. నేను మొదట హైడ్రాకు సపోర్ట్ చేశాను. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించిన కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఎందుకీ హైడ్రామాలు? అక్రమ భవనాలకు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పారు.
తెలంగాణలో ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా నాటకం ఆడుతున్నారు !
الاثنين، 9 سبتمبر 2024
telangana అక్రమార్కుల భరతం పట్టండని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణలో ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా నాటకం ఆడుతున్నారు పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దు
ليست هناك تعليقات:
إرسال تعليق