ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసులో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి కనిపించకుండా పోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు. అయితే కేసు నమోదు చేసే వరకూ అరెస్టు పోలీసులకు చేసే అవకాశం ఉండదు. కానీ నిఘా పెట్టవచ్చు. పారిపోకుండా చూసుకోవచ్చు. కానీ పోలీసులు ఆ విషయంలో ఎందుకు విఫలమవుతున్నారన్నది హాట్ టాపిక్. ఇప్పటికే గనుల శాఖ ఘనుడు వెంకటరెడ్డి, లిక్కర్ స్కామ్‌స్టర్ వాసుదేవరెడ్డి వంటి వారు పరారీలో ఉన్నారు. ఎప్పుడు అరెస్టు చేస్తారో స్పష్టత లేదు. ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఎక్కువ మంది అనుకుని సంతృప్తి పడుతున్నారు . ఇప్పుడు జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ అత్యంత కీలకం. ఆయనను ఇంటరాగేట్ చేస్తే మొత్తం కేసు కొలిక్కి వచ్చేస్తుంది.
కుక్కల విద్యాసాగర్ పరారీ ?
الأربعاء، 18 سبتمبر 2024
Andhra Pradesh Criem కుక్కల విద్యాసాగర్ పరారీ ? పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసు
ليست هناك تعليقات:
إرسال تعليق