ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటికి ముగింపు పలికేందుకు ఆయన శుక్రవారం తిరుమలకు వెళ్లి పూజలు చేయనున్నట్లు మూడ్రోజుల క్రితం వైసీపీ ప్రకటించారు. అనంతరం తిరుమలలో పార్టీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన తిరుమలకు వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీవారి క్షేత్రానికి ఫ్యాన్ పార్టీ అధినేత రాకను నిరసిస్తూ కూటమి నేతలు, హిందూ సంఘాలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే గుడిలోకి అడుగుపెట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు వైసీపీ తెలిపింది.
జగన్ తిరుమల పర్యటన రద్దు !
الجمعة، 27 سبتمبر 2024
Andhra Pradesh జగన్ డిక్లరేషన్ ఇస్తేనే గుడిలోకి అడుగుపెట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ జగన్ తిరుమల పర్యటన రద్దు తిరుమలకు వెళ్లి పూజలు చేయనున్నట్లు
ليست هناك تعليقات:
إرسال تعليق