తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీ వేంకట్వేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుమలకు వెళ్లే వారికి సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేస్తూ ట్వీట్ చేశారు. "కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతీ భక్తుడూ అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉంది. స్వామివారి సన్నిధికి వెళ్లే వారు ఆలయ నియమాలు, ఆగమశాస్త్ర ఆచారాలు, టీటీడీ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరుతున్నా. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః" అంటూ ట్వీట్ చేశారు.
తిరుమలకు వెళ్లేవారు ఆలయ నిబంధనలు పాటించాల్సిందే : సీఎం చంద్రబాబు ట్వీట్ !
الجمعة، 27 سبتمبر 2024
Andhra Pradesh ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి తిరుమలకు వెళ్లేవారు ఆలయ నిబంధనలు పాటించాల్సిందే భక్తుల మనోభావాలకు సీఎం చంద్రబాబు ట్వీట్
ليست هناك تعليقات:
إرسال تعليق