ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉంటే అందులో 32 డివిజన్లు పూర్తిగా వరదల్లో చిక్కుకున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ నగరంలో అనేక వార్డులు ముంపునకు గురైనట్లు చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి మంత్రులను, కలెక్టర్లు, అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగిన ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని వివరించారు. ఇందుకు మనకున్న చట్ట నిబంధనలు సరిపోకపోతే, అవసరమైతే కొత్త చట్టం తెస్తామని నారాయణ తేల్చిచెప్పారు. రేపు ఉదయానికల్లా విజయవాడ నగరంలో ఎలాంటి వరద నీరు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటి నష్టం అంచనా ప్రక్రియ అవసరమైతే ఇంకో రోజూ పొడిగిస్తామన్నారు. ఇంట్లో లేకపోయినా, వేరే ప్రాంతానికి వెళ్లినా వారు వచ్చాక నష్టం అంచనా నమోదు చేస్తామని భరోసానిచ్చారు. 10వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారని నారాయణ తెలిపారు. బుడమేరకు గండిపడి వచ్చిన నీటికి పోయే దారి లేక ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. రేపు, ఎల్లుండి కూడా అవసరమైన చోట ఆహారం అందించానున్నట్లు మంత్రి తెలిపారు.
ホーム
/
మంత్రి నారాయణ
/
బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై సీఎం ఆదేశాలిచ్చారు : మంత్రి నారాయణ
الثلاثاء، 10 سبتمبر 2024
Andhra Pradesh కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉంటే అందులో 32 డివిజన్లు పూర్తిగా వరదల్లో చిక్కుకున్నాయి బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై సీఎం ఆదేశాలిచ్చారు మంత్రి నారాయణ
ليست هناك تعليقات:
إرسال تعليق