ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగు దేశం ప్రభుత్వంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చామని, నాడు పలు స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడితే గత ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసిందని అన్నారు. నాడు ప్రారంభమై కొంతమేర పూర్తి అయిన స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని….క్రీడలు అంటే కేవలం పోటీల్లో పాల్గొనే వాళ్లకు సంబంధించిన విషయంగానే చూడవద్దని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వాళ్లు కూడా క్రీడల్లో భాగస్వాములు అయ్యేలా చేయాలన్నారు. గతంలో గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్ వంటి ఆటలు ఆడేవారని, ఇప్పుడు టీవీలు, ఇతర మాధ్యమాల కారణంగా ఆ సంస్కృతి పోయిందని సీఎం అన్నారు. మళ్లీ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే ప్రజలు ఆటల వైపు మొగ్గుచూపుతారని సీఎం అన్నారు. కబడ్డీ వంటి ఆటలకు ఆట స్థలాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ పనులు చేయవచ్చని తెలిపారు. ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలు క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ముందుకు వస్తే వారి పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తద్వారా ఆయా గ్రామాల్లో క్రీడా వసతులుఏర్పాటు అవుతాయని సీఎం అన్నారు. ఆటల ద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, ఐక్యత పెరుగుతుందని, ఇదొక మంచి సంస్కృతిగా నిలుస్తుందని సీఎం అన్నారు. 2027లో వచ్చే జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో నిర్వహించాలనేది లక్ష్యంగా పెట్టుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలన్నారు.
ホーム
/
స్టేడియాలు
/
స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి !
الخميس، 26 سبتمبر 2024
Andhra Pradesh క్రీడా ప్రాంగణాలు క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టేడియాలు
ليست هناك تعليقات:
إرسال تعليق