బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలకు సంబంధించిన తమ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది కాగా 2002 గుజరాత్ గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపినందుకు దోషులుగా ఉన్న 11 మందిని ముందస్తుగా విడుదల చేయడంపై గత జనవరిలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దోషుల శిక్షాకాలం ముగియకముందే 'సత్ప్రవర్తన' కారణంగా గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మండిపడింది. 11 దోషులందరూ వెంటనే జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు పలు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది చట్ట ఉల్లంఘనేనని తెలిపింది. గుజరాత్ సర్కార్ దోషులతో కుమ్మకైందని,అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను తొలగించాలని గుజరాత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం వ్యాఖ్యలు సరికాదని, కేసు రికార్డుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంపై పక్షపాతంతో వ్యవహరించారని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది
గుజరాత్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ !
الخميس، 26 سبتمبر 2024
national గుజరాత్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ జస్టిస్ ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ధర్మాసనం జస్టిస్ బీవీ నాగరత్న బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలకు సంబంధించి
ليست هناك تعليقات:
إرسال تعليق