తమిళ హీరో జీవా చైన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్‌ను ఢీకొట్టింది. అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ జీవా తనతో పాటు ఉన్న ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. జీవా తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. జీవా తెలుగులో రంగం సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత డైరెక్టర్ మహి.వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర2లో జగన్ పాత్రలో జీవా నటించి శభాష్ అనిపించుకున్నాడు.
తమిళ హీరో జీవాకు రోడ్డు ప్రమాదం
الأربعاء، 11 سبتمبر 2024
Andhra Pradesh cinema tamilnadu telangana జీవా తనతో పాటు ఉన్న ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు తమిళ హీరో జీవాకు రోడ్డు ప్రమాదం
ليست هناك تعليقات:
إرسال تعليق