మంకీపాక్స్ సోకిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. రోగిని ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఆ వ్యక్తి నమూనాను సేకరించి, మంకీపాక్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించేందుకు పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు మూలాలను గుర్తించడానికి, దేశంలోని మరిన్ని ప్రాతాల్లో అంచనా వేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఆ వ్యక్తి విదేశాల నుంచి తిరిగి వచ్చిన క్రమంలో జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. కానీ అనుమానిత రోగి వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకోలేదు. అనుమానిత రోగి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగిని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పేషెంట్ శాంపిల్స్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఏదో ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం అతనితో పరిచయం ఉన్న వ్యక్తులను విచారిస్తున్నారు. మంకీ పాక్స్ మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ప్రభావితమైంది. కాంగోలో ఇప్పటివరకు దాదాపు 18 వేల మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు ?
الأحد، 8 سبتمبر 2024
national కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడి దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు ? ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని రోగిని ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారని
ليست هناك تعليقات:
إرسال تعليق