ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు. ఏపీ పోలీసు అధికారుల సంఘం రూ.11,12,50,000 విరాళం ఇచ్చింది. దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం కోటి రూపాయలు, వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.50 లక్షలు, వై.రాజారావు రూ.10 లక్షలు, కె.సాంబశివరావు రూ.5 లక్షలు, సి.టి.చౌదరి రూ.2.55లక్షలు, శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఒనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2.21లక్షలు, వెలగపూడి సత్యనారాయణ రూ.2లక్షలు, ఎమ్.శ్రీనివాసరావు రూ.2లక్షలు, పువ్వాడ రామకృష్ణ రూ.2లక్షలు, సీహెచ్.శివరామకృష్ణ రూ.1.32లక్షలు, నవీన్ బాబు రూ.1.16లక్షలు, జాస్తి శైలజారాణి రూ.లక్ష, శాంభవి రూ.లక్ష, జె.శశాంక్ చౌదరి రూ.లక్ష, ఎస్.సాంబశివరావు రూ.లక్ష, దూళిపాళ్ల రామకృష్ణ రూ.లక్ష, డాక్టర్ యు.గంగాధర్ రెడ్డి రూ.లక్ష, చెరుకూరి వెంకటరావు రూ.లక్ష, జె.సత్యనారాయణ మూర్తి రూ.లక్ష, ఎన్.నాగేశ్వరరావు రూ.70 వేలు, రాణి శారదా రూ.50వేల విరాళం చెక్కును సీఎంకు అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సాయం అందిస్తున్న దాతలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి ఏపీ పోలీసు అధికారుల సంఘం రూ.11,12,50,000 విరాళం !
الأحد، 8 سبتمبر 2024
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి ఏపీ పోలీసు అధికారుల సంఘం విరాళం చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల సహాయం కోసం
ليست هناك تعليقات:
إرسال تعليق