సెప్టెంబర్ 23న శామ్ సంగ్ గెలాక్సీ ఎం 55s స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తునట్లు శామ్ సంగ్ ప్రకటించింది. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. అందుకే, అమెజాన్ ఇండియా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి మరీ టీజింగ్ చేస్తోంది. శామ్ సంగ్ గెలాక్సీ ఎం 55s స్మార్ట్ ఫోన్ సరికొత్త ఫ్యూజన్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నగా, బ్యాక్ ప్యానల్ లో ఆకర్షణీయమైన డబుల్ డిజైన్ ప్యాట్రన్ ను కలిగి వుంది. వాస్తవానికి, ఇప్పటి వరకు శామ్సంగ్ కేవలం రెగ్యులర్ సింగిల్ కలర్ తో మాత్రమే తన ఫోన్ లను అందించింది. అయితే, ఇప్పుడు ఈ కొత్త ఫోన్ ను మాత్రం సరికొత్త డిజైన్ తో అందిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 50MP OIS మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది No Shake వీడియోలు మరియు బ్లర్ ఫ్రీ ఫోటోలు అందిస్తుందని శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ సెల్ఫీ కెమెరాతో గ్రూప్ ఫోటోలు మరియు వీడియో రికార్డింగ్ తో పాటు క్వాలిటీ వీడియో కాలింగ్ సౌకర్యం అందుతుందని కూడా శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ ఉంటుందని కూడా శామ్సంగ్ తెలిపింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ థండర్ బ్లాక్ మరియు కోరల్ గ్రీన్ రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది.
0 Comments