ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Vu సరికొత్తగా ఇండియన్ మార్కెట్ లో మూడు కొత్త స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఈ మూడు టీవీలను కూడా Vu GLOLED 2025 సిరీస్ నుంచి సరికొత్త AI ప్రోసెసర్ తో అందించింది. ఈ టీవీలు సొగసైన స్లీక్ డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టాయి. ఇందులో 43 ఇంచ్, 50 ఇంచ్ మరియు 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లు ఉన్నాయి. 43 ఇంచ్ టీవీని రూ. 27,999 ధరతో, 50 ఇంచ్ టీవీని రూ. 32,999 ధరతో, 55 ఇంచ్ టీవీ ని రూ. 36,999 ధరతో లాంచ్ చేసింది. ఈ టీవీలు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ స్మార్ట్ టీవీ లు Flipakrt మరియు Vu అధికారిక వెబ్సైట్ నుంచి లభిస్తాయి. ఈ మూడు టీవీలు కూడా సైజుల్లో మార్పులు ఉన్నా, ఒకే ఫీచర్స్ ను కలిగి ఉంటాయి. ఈ టీవీలు 1.5GHz AI-ఆధారిత VuOn ప్రోసెసర్ తో పనిచేస్తాయి. ఈ ప్రోసెసర్ ఫాస్ట్ గా ఉంటుంది మరియు గొప్ప గ్రాఫిక్స్ తో మంచి పిక్చర్ క్వాలిటీ అందిస్తుందని Vu పేర్కొంది. ఈ టీవీలు 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటాయి. వీడియో కాలింగ్ కోసం ఈ టీవీ ఎక్స్టర్నల్ కెమెరాకి కూడా సపోర్ట్ చేస్తుంది. 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన A+ స్క్రీన్ ను కలిగి ఉంటాయి. ఈ టీవీలు Dolby Vision, HDR 10, HLG మరియు AI పిక్చర్ స్మార్ట్ సీన్ మరియు అప్ స్కేల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. ఇది Google TV OS పై నడుస్తుంది మరియు Game Dashboard తో వస్తుంది. 24W టోటల్ సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ DTS Virtual-X సౌండ్ ఎన్ హెన్ మెంట్, Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో పాటు Audio Only Mode ఫీచర్ తో వస్తుంది. ఇందులో 3 HDMI, 2 USB, 1 ఆప్టికల్, 1 AV, 1 LAN, టూ వే బ్లూటూత్, కెమెరా కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
0 Comments