ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యులు పిఎంఎస్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పివిఎల్ మాధవరావు కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తరపున రూ.20 కోట్ల చెక్‌ను అందజేశారు. అటు తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్లు విరాళంగా అందించింది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అందించారు. రెండు రాష్ట్రాల్లో మొన్నటి అతి భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇంత భారీగా విరాళం ఇవ్వడం అనేది గొప్ప విషయమే. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు, సంస్థలు, వ్యక్తులు, విద్యార్థులు కూడా విరాళాలు ఇచ్చారు. కొంతమంది విద్యార్థులు తమ కిడ్డీ బ్యాంక్ నుంచి మనీ ఇచ్చారు. మరికొందరు తమ ఆస్తులు అమ్ముకొని మనీ ఇచ్చారు. ఇంకొందరు నగలు అమ్మి మరీ విరాళం ఇచ్చారు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. మంచి మనసున్న వారంతా వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చి.. కష్టసమయాల్లో అండగా, తోడుగా మేమున్నామని భరోసా, ధైర్యం ఇచ్చారు. భవిష్యత్తును పాజిటివ్‌గా చూసేలా చేశారు.
ホーム
/
పివిఎల్ మాధవరావు
/
ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం !
الجمعة، 27 سبتمبر 2024
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం నీతా అంబానీ తరపున రూ.20 కోట్ల చెక్‌ను అందజేశారు పిఎంఎస్ ప్రసాద్ పివిఎల్ మాధవరావు
ليست هناك تعليقات:
إرسال تعليق