జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారంలో ఒక్కరోజైననా రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటిని పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. వారంలో ఒక్కరోజైన చేనేత వస్త్రాలు ధరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ. మన రాష్ట్రంలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయి. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు అనే మాట ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపాయి. అలాంటి చేనేత రంగానికి జీవంపోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రాష్ట్రంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం కచ్చితంగా చేనేత పరిశ్రమకు, ఈ రంగంపై ఆధారపడ్డ నేతన్నలకు భరోసా ఇస్తుంది. అదే విధంగా ప్రజలు సైతం ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాల కిందటే నేను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను అని చెప్పాను. ఆ క్రమంలోనే నేత వస్త్రాలను ధరిస్తున్నాను. అదే విధంగా యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే ఈ రంగంపై ఆధారపడ్డవారికి ధీమా కలుగుతుంది' అని ప్రకటనలో పేర్కొన్నారు.
వారంలో ఒక్కరోజైనా రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
الأربعاء، 7 أغسطس 2024
Andhra Pradesh ఉప్పాడ ఎమ్మిగనూరు చీరాల జాతీయ చేనేత దినోత్సవం పెడన పొందూరు మంగళగిరి వారంలో ఒక్కరోజైనా రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి వెంకటగిరి
ليست هناك تعليقات:
إرسال تعليق