యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి వారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో రూ. రెండున్నర కోట్లకు పైగా నగదు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కొండకింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో చేపట్టిన ఈ లెక్కింపులో స్వామి వారికి నగదు రూపంలో రూ. 2,66,68,787, మిశ్రమ బంగారం 87 గ్రాములు, వెండి 3,300 గ్రాముల చొప్పున వచ్చినట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. లెక్కింపులో ఈవోతో పాటు ఆలయ ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ సిబ్బందితో పాటు సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి వారికి భారీగా విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
యాదాద్రి ఆలయం హుండీ ఆదాయం రూ. 2.66 కోట్లు !
الأربعاء، 7 أغسطس 2024
300 గ్రాముల చొప్పున వచ్చింది bhakti telangana నెల రోజుల వ్యవధిలో మిశ్రమ బంగారం 87 గ్రాములు యాదాద్రి ఆలయం హుండీ ఆదాయం రూ. 2.66 కోట్లు వెండి 3
ليست هناك تعليقات:
إرسال تعليق