హైదరాబాద్ లోని కాటేదాన్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల బోల్తా పడింది. బస్సులో ఉన్న కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీ మణికంఠ హిల్స్ లో పయనీర్ కాన్సెప్ట్ హై స్కూల్ను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు సరైన రోడ్డు మార్గం లేదు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో బస్సు డ్రైవర్ ఆదిల్ బస్సును పాఠశాల ఆవరణలోని ఓ ఎత్తయిన ప్రదేశంలో నిలిపాడు. అనంతరం బస్సుకు హ్యాండ్ బ్రేక్ వేసిన ఆదిల్ బస్సు దిగి కిందకు వెళ్లాడు. కాసేపటికి విద్యార్థులు తమ ఇంటికి వెళ్లేందుకు ఆ బస్సు ఎక్కారు. విద్యార్థులు ఆడుకుంటూ బస్సు హ్యాండ్ బ్రేక్ ను తొలగించారు. దీంతో ఒక్కసారిగా బస్సు అతివేగంగా వెనక్కి వచ్చి, పార్కు చేసి ఉన్న ఓ ఇండికా కారును ఢీకొని బొల్తా కొట్టింది. బస్సులో ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో వెంటనే స్పందించిన స్థానికులు.. పిల్లలను బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారని, అందులో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ