హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి వీడియోస్ అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. దిల్ సుఖ్ నగర్ కి చెందిన చామకూరి లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ల బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద వీడియోలను ఓ సినిమా సన్నివేశంలోని 'బాబీ' అంటూ ఉండే అసభ్యకర ఆడియోను జోడించి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేసాడు లక్ష్మణ్. అయితే లక్ష్మణ్ ను ఈ తరహా పోస్ట్ పెట్టేందుకు ఎవరూ ప్రోత్సహించారు.. అసలు సూత్రదారులు ఎవరు అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మేయర్ పోస్ట్ లు వైరల్ చేయించిన ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్ మేయర్ వీడియోస్ మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్
السبت، 10 أغسطس 2024
Criem telangana దిల్ సుఖ్ నగర్ కి చెందిన చామకూరి లక్ష్మణ్ సినిమా సన్నివేశంలోని 'బాబీ' అంటూ ఉండే అసభ్యకర ఆడియోను జోడించి మార్ఫింగ్ హైదరాబాద్ మేయర్ వీడియోస్ మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్
ليست هناك تعليقات:
إرسال تعليق