తిరుమలలో తోమాల సేవ టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి రెండున్నర లక్షలు వసూలు చేసి మోసం చేశారని గుంటూరుకు చెందిన కొంత మంది వ్యక్తులు కుప్పం ఎమ్మెల్సీ భరత్ తో పాటు ఆయన పీఏపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఆన్ లైన్ లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశామని వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించారు. వాట్సాప్ చాట్స్, ఇతర ఆధారాలు కూడా ఇచ్చారు. చంద్రబాబుపై పోటీ చేసిన భరత్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వైసీపీ హయాంలో సిఫారసు లేఖల ద్వారా టిక్కెట్లు అమ్ముకోవడం పెద్ద వ్యాపారంగా మారింది. దాన్నే టీడీపీ హయాంలోనూ కొనసాగించేందుకు ప్రయత్నిచారు. ఎమ్మెల్సీగా తన లేఖలను టిక్కెట్ల అమ్మకానికి వినియోగించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అనుకున్న విధంగా టిక్కెట్లు దక్కకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ భరత్పై కేసు !
الثلاثاء، 6 أغسطس 2024
Andhra Pradesh ఎమ్మెల్సీ భరత్పై కేసు తిరుమలలో తోమాల సేవ టిక్కెట్లు ఇప్పిస్తామని భరత్ తో పాటు ఆయన పీఏపై పోలీసులకు ఫిర్యాదు రెండున్నర లక్షలు వసూలు చేసి మోసం చేశారని
ليست هناك تعليقات:
إرسال تعليق