ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున వున్న దాదాపు 150 ఏళ్ల కాలం నాటి నిద్రగన్నేరు చెట్టు నేలకొరిగింది. ఈ చెట్టు నీడన దాదాపుగా 300 సినిమాల్లోని సీన్స్, సాంగ్స్ షూట్ చేశారు. ముఖ్యంగా దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలు తమ కెరీర్ లోని అత్యద్భుత సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్రహీరోల సినిమాల్లోని కొన్ని సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. ఏటా వరదలకు గట్టు కొద్దికొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి ఈ వృక్షం నేలకొరిగింది.
నేలకొరిగిన 150 ఏళ్ల నిద్ర గన్నేరు చెట్టు !
الثلاثاء، 6 أغسطس 2024
Andhra Pradesh cinema కె.రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలు తమ కెరీర్ లోని అత్యద్భుత సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు కె.విశ్వనాథ్ నేలకొరిగిన 150 ఏళ్ల నిద్ర గన్నేరు చెట్టు బాపు
ليست هناك تعليقات:
إرسال تعليق