పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు సత్తా చాటారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ ద్వయం అద్భుత ప్రదర్శనతో సెమీ ఫైనల్‌కు చేరింది. దీంతో వీరు పతకానికి మరో అడుగు దూరంలో ఉన్నారు. క్వార్టర్స్ ఫైనల్‌లో అంకిత, ధీరజ్ ధ్వయం 5-3 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో ఈ జంట దక్షిణ కొరియా లేదా ఇటలీతో తలపడనుంది. ఒలింపిక్స్ ఆర్చరీ మిక్స్‌డ్ డబుల్స్ చరిత్రలో భారత్ సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. ఒలింపిక్స్ గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో గెలుపొందింది. పూల్ బి నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆసీస్ క్వార్డర్ ఫైనల్ చేరాయి. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి.
సెమీ ఫైనల్ కు చేరిన భారత ఆర్చర్లు - హాకీలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం
الجمعة، 2 أغسطس 2024
olympics 2024 అంకిత భకత్ ద్వయం అద్భుత ప్రదర్శన బొమ్మదేవర ధీరజ్ సెమీ ఫైనల్ కు చేరిన భారత ఆర్చర్లు హాకీలో ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో భారత్ విజయం హాకీలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం
ليست هناك تعليقات:
إرسال تعليق