కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌తో యువతను మభ్య పెడుతోందని భారాస ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్ వద్ద భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదన్నారు. నాలుగు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని విమర్శించారు. ''నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచింది. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటనలు చేశారు. రాహుల్ గాంధీ 2లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు ఎక్కడ? రేవంత్‌రెడ్డి కొత్తగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్‌కు వస్తే యువత తన్ని తరిమేస్తుంది. మభ్యపెట్టి ఎక్కవ రోజులు ప్రభుత్వాన్ని నడపలేరు. మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని మీకు తెలుసు. యువతను కాంగ్రెస్ మోసం చేస్తోంది. తెలంగాణ యువత తరఫున పోరాడుతుంటే మమ్మల్ని తిడుతున్నారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వ్యక్తికి మైక్ ఇచ్చి తిట్టించారు'' అని కేటీఆర్ మండిపడ్డారు.
జాబ్ క్యాలెండర్‌తో యువతను మభ్యపెడుతున్నారు !
الجمعة، 2 أغسطس 2024
telangana ఎమ్మెల్సీలు నిరసన గన్‌పార్క్ వద్ద భారాస ఎమ్మెల్యేలు జాబ్ క్యాలెండర్‌తో యువతను మభ్యపెడుతున్నారు నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచింది
ليست هناك تعليقات:
إرسال تعليق