దేశంలో ఆరు రాష్ట్రాల్లో ఆవరించి ఉన్న పశ్చిమ కనుమల్లో దాదాపు 56వేల చ.కి.మీ పరిధిని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటిస్తూ ఐదో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన 13 గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కోరింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో దాదాపు 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి జులై 31న కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళలో ఇటీవల ప్రభావానికి గురైన వయనాడ్‌లోని 13 గ్రామాలు సహా మొత్తం 9993.7 చ.కి.మీ విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్రలో 17,340 చ.కి.మీ, కర్ణాటకలో 20,668చ.కి.మీ, తమిళనాడులో 6914చ.కి.మీ, గోవాలో 1461చ.కి.మీ, గుజరాత్‌లో 449 చ.కి.మీ ప్రాంతం దీని కిందకు వస్తుందని తెలిపింది. ఈ ముసాయిదా ప్రకారం ఆయా ప్రాంతాల్లో మైనింగ్, క్వారీ, ఇసుక తవ్వకాలు నిషేధం. ఇప్పటికే అక్కడ మైనింగ్ కార్యక్రమాలు చేపడుతుంటే మాత్రం వచ్చే ఐదేళ్లలో దశల వారీగా వాటికి ముగింపు పలుకుతారు. కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టులు కూడా నిషేధం. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను కొనసాగిస్తారు. అయితే, వాటి విస్తరణకు మాత్రం అనుమతి ఉండదు. కొత్తగా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌ల నిర్మాణమూ నిషేధం.
వయనాడ్ సహా పశ్చిమ కనుమల్లో 56వేల చ.కి.మీ సున్నిత ప్రాంతం !
الجمعة، 2 أغسطس 2024
national అభ్యంతరాలు ఐదో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల వయనాడ్ సహా పశ్చిమ కనుమల్లో 56వేల చ.కి.మీ సున్నిత ప్రాంతం సలహాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కోరింది
ليست هناك تعليقات:
إرسال تعليق