తెలంగాణ శాసన సభ దుశ్శాసన సభగా మారింది. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. నిన్న మహిళ ఎమ్మెల్యేలను అవమానపరిచారు. సభ నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టేపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానం నాగేందర్ మాట్లాడే భాష రౌడీ షీటర్ మాట్లాడే భాషలా వుంది. కన్న తల్లులను అవమానపరిచే విధంగా దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయి. మాతృత్వం విలువ తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారు. దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. మా హయంలో మేము ఎన్నడూ ఇలా చెయ్యలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో దానం నాగేందర్ ఇలానే మాట్లాడడు. జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయింది. వృద్దులకు , మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ మాట్లాడాడు. జాబ్ క్యాలెండర్ పై చర్చకు బయపడింది. చర్చ చెయ్యమంటే చెయ్యకుండా పారిపోయారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీనీ వదిలిపెట్టం అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి !
الجمعة، 2 أغسطس 2024
telangana కన్న తల్లులను అవమానపరిచే విధంగా దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయి దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి సభ నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టేపించే ప్రయత్నం చేస్తున్నాడు
ليست هناك تعليقات:
إرسال تعليق