ఢిల్లీలోని జహంగీర్ పురి పారిశ్రామిక ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి ఒకరు మృతి చెందగా, మరో నలుగురిని శిథిలాల కింద నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ ఇప్పటివరకు నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించామన్నారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మధ్యాహ్నం 12:51 గంటలకు తమకు అత్యవసర కాల్ వచ్చిందని, ఆ తర్వాత ఐదు ఫైర్ టెండర్లను ఘటనా స్థలానికి పంపించామని చీఫ్ చెప్పారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారన్న అనుమానంతో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఢిల్లీలో భవనం కూలి ఒకరు మృతి !
الجمعة، 2 أغسطس 2024
Criem New Delhi ఢిల్లీలో భవనం కూలి ఒకరు మృతి నలుగురిని శిథిలాల కింద నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చని
ليست هناك تعليقات:
إرسال تعليق