'ఎక్స్'లో పేమెంట్స్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఎక్స్‌లో రానున్న ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్‌ను 'ఎక్స్'గా మార్చాక దీన్నో సూపర్ యాప్‌గా తీర్చిదిద్దుతానని ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముందడుగు వేసి తన ప్లాట్‌ఫామ్ వేదికగా పేమెంట్స్ జరిపే సదుపాయాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఈ కొత్త ఫీచర్లకు సంబంధించి స్క్రీన్ షాట్ Nima Owji అనే ఓ వెబ్ డెవలపర్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. త్వరలోనే పేమెంట్స్ యాప్ రానుందని వెల్లడించారు. లావాదేవీలు జరపడంతో పాటు, బ్యాలెన్స్, పేమెంట్స్ హిస్టరీ కూడా అక్కడే తెలుసుకోవచ్చు. అయితే 'ఎక్స్'లో రాబోయే ఈ ఫీచర్ వాలెట్ సిస్టమ్ లాగా ఉంటుందా? లేదా నేరుగా బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయొచ్చా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
'ఎక్స్'లో పేమెంట్స్ ఫీచర్ ?
السبت، 10 أغسطس 2024
'ఎక్స్'లో పేమెంట్స్ ఫీచర్ ? science technology ట్విటర్‌ను 'ఎక్స్'గా మార్చాక దీన్నో సూపర్ యాప్‌గా తీర్చిదిద్దుతానని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు పేమెంట్స్ హిస్టరీ బ్యాలెన్స్ లావాదేవీలు జరపడంతో పాటు
ليست هناك تعليقات:
إرسال تعليق