కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత, కోతల ప్రభుత్వమని భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. పింఛన్ పెంపు, రైతుబంధు, తులం బంగారం.. మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పింఛన్ పెంపు దేవుడెరుగు, 2 నెలల నుంచి ఉన్న పింఛనే రావట్లేదని ఆరోపించారు. ''తులం బంగారం దేవుడెరుగు. కేసీఆర్ ఇచ్చిన రూ.లక్ష కూడా ఎగ్గొట్టారు. అబద్ధాలు, మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గ్రామాల్లో చెత్త పేరుకుపోతోంది. ట్రాక్టర్ డీజిల్‌కు కూడా డబ్బుల్లేవు. మధ్యాహ్న భోజనం కార్మికులకు 8 నెలలుగా జీతాలు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పని చేసే కార్మికులకు జీతాల్లేవు. గ్రామాల్లో కుక్కలు, వసతి గృహాల్లో ఎలుకలు దాడి చేస్తున్నాయి'' అని హరీశ్‌రావు అన్నారు.
అబద్ధాలు, మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది !
السبت، 10 أغسطس 2024
telangana అబద్ధాలు భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శ మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ
ليست هناك تعليقات:
إرسال تعليق