హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే తొలి ఫ్లైయింగ్ ట్యాక్సీ ఇది. విమానాలను తయారు చేసే అమెరికన్ కంపెనీ 'జోబీ ఏవియేషన్స్' ఇటీవల దీనికి రూపకల్పన చేసింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎగిరే కార్లను రూపొందించాయి. 'జోబీ ఏవియేషన్స్' ఆరు ప్రొపెల్లర్లతో రూపొందించిన ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఎటువంటి ఉపరితలం పైనుంచి అయినా, ఉన్న చోటు నుంచి నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. ఇటీవల కాలిఫోర్నియాలో పరీక్షాత్మకంగా దీని ప్రయాణాన్ని నిర్వహించినప్పుడు, హైడ్రోజన్ ఇంధనంతో ఇది ఏకధాటిగా 902 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇదివరకటి ఫ్లైయింగ్ కార్ల రికార్డులను బద్దలు కొట్టింది. దీని గరిష్ఠ వేగం గంటకు 322 కిలోమీటర్లు. ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ రూపకల్పన కోసం అమెరికన్ సైన్యం కొంతవరకు నిధులు సమకూర్చినట్లు 'జోబీ ఏవియేషన్స్' వ్యవస్థాపకుడు, సీఈవో జోబెన్ బెవిర్ట్ వెల్లడించారు. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకుపోయేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక అవసరాలకు మాత్రమే కాకుండా, దేశాల మధ్య కూడా ఇది ప్రయాణించగలదని, దాదాపు 900 కిలోమీటర్ల వరకు దీనికి ఇంధనం నింపాల్సిన అసరం ఉండదని బెవిర్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఉత్పత్తిని 2050 నాటికి వాణిజ్యపరంగా ప్రారంభించనున్నామని వెల్లడించారు.
హైడ్రోజన్ ఇంధనంతో తొలి ఫ్లైయింగ్ ట్యాక్సీ !
الأحد، 11 أغسطس 2024
'జోబీ ఏవియేషన్స్' ఆరు ప్రొపెల్లర్లతో రూపొందించిన ఫ్లైయింగ్ ట్యాక్సీ science technology ఏకధాటిగా 902 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హైడ్రోజన్ ఇంధనంతో తొలి ఫ్లైయింగ్ ట్యాక్సీ
ليست هناك تعليقات:
إرسال تعليق