పాకిస్తాన్ ఐఎస్‌ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్‌ను సైన్యం అరెస్టు చేసింది. హౌసింగ్ కుంభకోణానికి సంబంధించి అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ పేర్కొంది. పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ''టాప్ సిటీ కేసులో విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌పై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు'' అని ఐఎస్‌ఐ ప్రజాసంబంధాల విభాగం పేర్కొంది. పాకిస్తాన్ ఐఎస్‌ఐ చీఫ్‌గా 2019 నుంచి 2021గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) హమీద్ శక్తిమంతమైన వ్యక్తిగా పరిగణించేవారు. ఇదే సమయంలో ఓ హౌసింగ్ స్కీమ్‌లో అవకతవకలు జరిగిన విషయం బయటకు వచ్చింది. ఇందులో హమీద్‌పై ఆరోపణలు రావడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పాక్ సైన్యం ఓ దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
పాకిస్తాన్ ఐఎస్‌ఐ మాజీ చీఫ్ అరెస్ట్ !
الاثنين، 12 أغسطس 2024
international ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆయనపై క్రమశిక్షణా చర్యలు జనరల్ ఫయాజ్ హమీద్ పాకిస్తాన్ ఐఎస్‌ఐ మాజీ చీఫ్ అరెస్ట్ హౌసింగ్ కుంభకోణానికి సంబంధించి అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో
ليست هناك تعليقات:
إرسال تعليق