ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ద్వారంపూడి, ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు 24 మందిపై కేసు నమోదైంది. ఈనెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సూరిబాబుకు చెందిన బిల్డింగ్‌ను అక్రమ కట్టడం అంటూ కూల్చివేసే ప్రయత్నం చేశారు మున్సిపల్ అధికారులు. కూల్చివేతలను అడ్డుకునేందుకు అనుచరులతో అక్కడికి వెళ్లారు ద్వారంపూడి. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యేపై మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడి తమతో గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో A1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, A2గా బళ్ల సూరిబాబును చేర్చారు.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు !
الجمعة، 5 يوليو 2024
Andhra Pradesh Criem అక్రమ కూల్చివేతలను అడ్డుకునందుకు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు
ليست هناك تعليقات:
إرسال تعليق