తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిర్సనగండ్ల లో తనకు పిల్లలు పుట్టడం లేదని రాజశ్రీ (29) అనే వివాహిత మనస్థాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పపడింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు ఇక పిల్లలు పుట్టరు. జీవితంపై విరక్తిగా వుంది అంటూ భర్తకు ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి చేరుకోగా, అప్పటికే రాజశ్రీ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను నల్లగొండ జిల్లా మాల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశ్రీ తుది శ్వాస విడిచింది. రాజశ్రీని ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంభంపాడు గ్రామానికి చెందిన శేషు కుమార్ కి ఇచ్చి 2014 వివాహం జరిపించారు. పెళ్లై పదేళ్లు అయినప్పటికీ దంపతులకు సంతాన భాగ్యం కలగకపోవడంతో ఇరుగుపొరుగు వారు సూటి పోటి మాటలు భరించలేకపోయింది రాజశ్రీ. పిల్లలు పుట్టకపోవడంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. మూడు నెలల క్రితం భర్తతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు సంతానం లేక సమాజంలో తలెత్తుకోలేకపోతున్నానని తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ホーム
/
పురుగుల మందు తాగి
/
పిల్లలు పుట్టడం లేదని బలవన్మరణానికి పాల్పపడిన వివాహిత !
الجمعة، 5 يوليو 2024
Criem telangana జీవితంపై విరక్తిగా వుంది అంటూ భర్తకు ఫోన్ పిల్లలు పుట్టడం లేదని బలవన్మరణానికి పాల్పపడిన వివాహిత పురుగుల మందు తాగి
ليست هناك تعليقات:
إرسال تعليق