ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను సాక్షిగా పరిగణించాలంటూ 4వ నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని, సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు. ఇప్పటికే సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగ పత్రంలో తనను సాక్షిగా చేర్చినట్టు కోర్టుకు తెలిపారు. దస్తగిరి తరఫు న్యాయవాది వాదనను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగిస్తున్నట్టు తెలిపింది.
వివేకా హత్యకేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి తొలగింపు !
الخميس، 25 يوليو 2024
Andhra Pradesh తనను సాక్షిగా పరిగణించాలంటూ వివేకా హత్యకేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి తొలగింపు షేక్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు
ليست هناك تعليقات:
إرسال تعليق