తమిళనాడులోని విరుద్‌నగర్‌లో కార్తిక్ పాండీ (26) అనే వ్యక్తి, 8 నెలల క్రితం 22 ఏళ్ల నందిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబానికి ఇష్టం లేకుండా ప్రేమించిన వ్యక్తిని నందిని వివాహమాడింది. దీనిపై నందిని కుటుంబం కార్తిక్ పాండీపై ద్వేషం పెంచుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుని తమ పరువు తీసిందని ఆమె కుటుంబం భావించింది. ఈ క్రమంలోనే బుధవారం కార్తీక్ పాండి తన భార్య పని చేసే సూపర్ మార్కెట్ నుంచి ఆమెను తీసుకువచ్చేందుకు వెళ్లిన సమయంలో నందిని కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేశారు. నందిని సోదరులు బాలమురుగన్, ధనబాల మురుగన్ కార్తిక్ పాండీని పదునైన ఆయుధాలతో దాడి పాల్పడ్డారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, కార్తీక్ పాండిని విరుదునగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసు నిందితులపై కేసు నమోదైంది. పరారైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు చెల్లి భర్త దారుణ హత్య !
الخميس، 25 يوليو 2024
Criem tamilnadu ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు చెల్లి భర్త దారుణ హత్య కుటుంబానికి ఇష్టం లేకుండా ప్రేమించిన వ్యక్తితో వివాహం నందిని సోదరులు పదునైన ఆయుధాలతో దాడి
ليست هناك تعليقات:
إرسال تعليق