ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిన్న స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలను కొన్నారు. రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని.. పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని పవన్ కల్యాణ్ నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పారు. పిఠాపురంలో ఎకరం మార్కెట్ విలువ రూ.15-17 లక్షల మేర ఉంది. మరో పదెకరాల భూమిని కొనేందుకు జనసేన నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్ !
الخميس، 4 يوليو 2024
2.08 ఎకరాలను Andhra Pradesh ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్ భోగాపురం
ليست هناك تعليقات:
إرسال تعليق