టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ విజేత టీమిండియా జట్టు ఈరోజు స్పెషల్ ఫ్లైట్‌లో స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి మౌర్య హోటల్‌కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ మేరకు ప్రపంచ కప్ అందుకున్న భారత క్రికెట్ జట్టును ప్రధాని మోడీ అభినందించారు ప్రపంచకప్ సాధించిన టీమిండియా జట్టుకు ప్రధాని మోదీ నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆటగాళ్లతో కలిసి ప్రధాని అల్పాహారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ.. జట్టు సభ్యులతో రెండు గంటలపాటు సమావేశం కానున్నారు. కాగా, ప్రధాని మోదీ రెండు బ్యాచ్‌లుగా భారత బృందాన్ని కలిశారు. తొలుత భారత ఆటగాళ్లను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. తర్వాత సపోర్టింగ్ స్టాప్‌తో మోదీ ములాఖత్ అయ్యారు. 

Post a Comment

أحدث أقدم