ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ (23) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మహ్మద్ సోహైల్ అతని స్నేహితుడు మహ్మద్ ఖదీర్‌తో కలిసి జూన్ 29వ తేదీన సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపునకు బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు. ఈ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన సోహైల్ అనేక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దక్షిణ భారత స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. మిస్టర్ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు.
మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్ దుర్మరణం !
الخميس، 11 يوليو 2024
Criem telangana ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు బైక్ అదుపుతప్పి స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్ దుర్మరణం
ليست هناك تعليقات:
إرسال تعليق