టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి. భారతీయ మూడో అతిపెద్ద జీవిత బీమా సంస్థ, రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బీమా సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ తమ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల ధరలను దాదాపు 10 శాతం మేర పెంచినట్టు తెలుస్తున్నాయి. అయితే 60 ఏండ్లకుపైబడినవారికే ఈ పెంపు వర్తిస్తుందని అంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం వ్యక్తిగత వార్షిక ప్రీమియంల విలువలో 5 శాతానికి సమానంగా దాని టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వాటా ఉన్నది. టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలూ 3 శాతం నుంచి 10 శాతం వరకు పెరిగాయి. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వార్షిక ప్రీమియంలలో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా 6 శాతంగా ఉన్నది. మరికొన్ని కంపెనీలూ తమ బీమా ప్రీమియంల రేట్లను పెంచాలని చూస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీల ధరలు 3 శాతం నుంచి 5 శాతం వరకు పెరగవచ్చన్న సంకేతాలున్నాయి.
భారీగా ప్రీమియం పెంచిన లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు ?
الخميس، 11 يوليو 2024
business national కనిష్ఠంగా 1 శాతం గరిష్ఠంగా 10 శాతం టాటా ఏఐఏ బజాజ్ అలియాంజ్ భారీగా ప్రీమియం పెంచిన లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు ? మ్యాక్స్ లైఫ్ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
ليست هناك تعليقات:
إرسال تعليق