తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా, అంగప్రదక్షిణ తదితర సేవలకు సంబంధించి అక్టోబరు నెల కోటా టికెట్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆర్జిత సేవా టికెట్లను జూలై 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై 20న ఉదయం 10 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు జులై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించాలని పేర్కొంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జులై 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జులై 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టోకెన్లను జులై 23 ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను జులై 23 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఇస్తోన్న ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను జులై 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అక్టోబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జులై 24న ఉదయం 10 గంటలకు, గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల-తిరుపతి శ్రీవారి సేవా కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లోనే విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది.
అక్టోబర్ నెల శ్రీవారి సేవా టికెట్ల విడుదల తేదీలు !
الاثنين، 15 يوليو 2024
Andhra Pradesh https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ national tamilnadu telangana అక్టోబర్ నెల శ్రీవారి సేవా టికెట్ల విడుదల తేదీలు తిరుమల తిరుపతి దేవస్థానం
ليست هناك تعليقات:
إرسال تعليق