తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారాస ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని, కావాలనే విపక్ష ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తోందని భారాస నేత కేటీఆర్ ఆక్షేపించారు. ప్రోటోకాల్ ఉల్లంఘటనలకు సంబంధించి ఆయన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లేఖ రాశారు. ప్రతి సందర్భంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. ''ప్రజలు ఎన్నుకొన్న ఎమ్మెల్యేలకు స్థానిక నియోజకవర్గంలో జరిగే ఏ పనికి సంబంధించైనా ప్రోటోకాల్ ఉంటుంది. కాంగ్రెస్ నాయకులుకావాలని భారాస ఎమ్మెల్యేలను అవమానించేలా ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు అందించాల్సిన చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలను కాదని, కాంగ్రెస్ నాయకులే పంపిణీ చేస్తున్నారు. హుజూరాబాద్, మహేశ్వరం, అసిఫాబాద్ సహా భారాస ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇలాగే జరుగుతోంది. శాసనసభ్యుల హక్కులు, వారికి ప్రోటోకాల్ పరిరక్షణ, గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత శాసనసభాపతిదే''అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల హక్కుల రక్షణ విషయంలో సభాపతి అధికారాలను వినియోగించి చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు వెంటనే సీఎస్ సహా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 'మూడుసార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా?' అని భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, మూడోస్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సెల్యూట్ కొట్టడం ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన ఆయన.. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతోన్న అవమానం పట్ల స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రోటోకాల్ విషయంలో స్పీకర్ చర్యలు తీసుకోవాలి !
الاثنين، 15 يوليو 2024
telangana అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లేఖ ప్రోటోకాల్ విషయంలో స్పీకర్ చర్యలు తీసుకోవాలి విపక్ష ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తోందని భారాస నేత కేటీఆర్ ఆక్షేపణ
ليست هناك تعليقات:
إرسال تعليق