హైదరాబాద్, జవహర్ నగర్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో ఆడుకుంటున్న విహాన్ (2) అనే బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. విహాన్ నెత్తి భాగాన్ని కుక్కల గుంపు పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. బాలుడి కేకలతో అప్రమత్తమైన కుటుంబసభ్యలు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు. ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కుక్కల దాడిలో బాలుడి మృతిపై విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతి కలిచివేసిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. పశు వైద్యులు, బ్లూక్రాస్‌ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. కుక్కలు దాడి చేస్తే అన్ని ఆసుపత్రుల్లో తక్షణం వైద్యం అందించాలని ఆదేశించారు.

Post a Comment

Previous Post Next Post