బాలికను గొంతు నులిమి చంపి, రాయి కట్టి కృష్ణానదిలో పడేశారు !


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసుల సంచలన విషయాలను వెల్లడించారు. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురేనని సెల్‌ఫోన్ లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలికను గొంతు నులిమి చంపిన వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మృతదేహాన్ని రాయి కట్టి కృష్ణానదిలో పడేశారని తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ఆదిరాజు సింగ్ రానా తెలిపారు. మైనర్ బాలిక పార్కు దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలురు ఆ అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు అన్నారు. ఆ ముగ్గురు పిల్లలలో ఒక బాలుడి తండ్రి, మరో బాలుడి పెదనాన్న వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు SDRF, NDRF, బృందాలతో సెర్చింగ్ నిర్వహించామని అమ్మాయి డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు. 

Post a Comment

0 Comments