ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించడానికి ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి జీవో ఇచ్చారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కేవలం ప్రతి తల్లికి రూ. 15 వేలు మాత్రమే ఇస్తానని జీవో ఇచ్చారు. ఇది సూపర్ సిక్సా? లేక సూపర్ మోసమా? ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కిన మోసగాడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. మోసం చేయటం చంద్రబాబుకు అలవాటు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఇప్పటికే అమ్మఒడి అందించేవారు అని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాల్సిందే. జనాన్ని మోసం చేయటంలో సీఎం చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. మోసాలు చేయటం అలవాటు పడిన చీటర్ చంద్రబాబు. చంద్రబాబుకు ఓట్లేసిన వారు ఆయన చేసిన మోసాలను గుర్తించాలి అని తెలిపారు. హామీలను అమలు చేయలేక వైఎస్ జగన్‌ను చంద్రబాబు దూషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
జనాన్ని మోసం చేయటంలో సీఎం చంద్రబాబు దిట్ట !
الخميس، 11 يوليو 2024
Andhra Pradesh జనాన్ని మోసం చేయటంలో సీఎం చంద్రబాబు దిట్ట ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు
ليست هناك تعليقات:
إرسال تعليق