హైదరాబాద్ లో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌లో ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సందడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ పక్కన స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న కుమారి ఆంటీ వద్దకు వెళ్లిన సోనూసూద్ అక్కడున్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కుమారి ఆంటీని కలిసి శాలువాతో సత్కరించి బోకే ఇచ్చారు. అనంతరం ఆమెతో సరదాగా మాట్లాడారు. పంచ్‌లు వేస్తూ అక్కడున్న వారిని నవ్వించారు. అంతేగాక, ఆమెకు ఫుడ్ సర్వ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు కుమారీ ఆంటీ బెస్ట్ ఉదాహరణగా సోనూ సూద్ అభివర్ణించారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం అవసరమైన చేస్తానని కుమారి ఆంటీకి సోనూ సూద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అంతేగాక, తన కొత్త సినిమాకు ప్రత్యేక అతిథిగా పాల్గొనాలంటూ ఆమెను ఆహ్వానించారు. కుమారి ఆంటీ కుటుంబసభ్యులతో ఆయన ఫొటోలు దిగారు.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌లో సోనూ సూద్ సందడి !
الجمعة، 5 يوليو 2024
cinema hyderabad telangana కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌లో సోనూ సూద్ సందడి తన కొత్త సినిమాకు ప్రత్యేక అతిథిగా పాల్గొనాలంటూ ఆమెను ఆహ్వానం మహిళా సాధికారతకు కుమారీ ఆంటీ బెస్ట్ ఉదాహరణ
ليست هناك تعليقات:
إرسال تعليق