బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.తాజాగా మంత్రి సీతక్క కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపారు. పరోక్షంగా మంత్రి సీతక్కను ఉద్దేశిస్తూ ‘ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ పార్టీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్‌లో బీఆర్ఎస్ పోస్టులు పెట్టింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క, బీఆర్ఎస్ అఫిషియల్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిరాధార ఆరోపణలు తగవంటూవార్నింగ్ ఇచ్చారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు గానూ తక్షణమే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. 

Post a Comment

أحدث أقدم