శ్రీశైలం పాతాళగంగా పాత మెట్ల మార్గంలో చిరుత సంచారం చేస్తోంది. డివైడర్‌పై చాలా సేపు కూర్చొని ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. గతంలోనూ అదే ప్రాంతంలో సంచారం చేసిందట !. స్థానికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. గత బుధవారం అర్ధరాత్రి చిరుత సంచారం సీసీకెమెరాల్లో రికార్డయింది. అర్ధరాత్రి సమయంలో టోల్ గేట్ చెకింగ్ పాయింట్ పక్కన చిరుతపులి సంచించిన వీడియోలు రికార్డయ్యాయి. టోల్ గెట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి చిరుతపులి నోటితో పట్టుకుని వెళ్లింది. ఈ దృశ్యాలు అక్కడి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
శ్రీశైలంలో చిరుత కలకలం !
الخميس، 18 يوليو 2024
Andhra Pradesh telangana చిరుత సంచారం సీసీకెమెరాల్లో రికార్డయింది పాతాళగంగా పాత మెట్ల మార్గంలో చిరుత సంచారం శ్రీశైలంలో చిరుత కలకలం
ليست هناك تعليقات:
إرسال تعليق