భూవివాదానికి సంబంధించి కొందరిని తుపాకీ చూపుతూ బెదిరించినట్లు ఆరోపణలున్న పూజా తల్లి మనోరమ ఖేద్కర్‌పై పుణె పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని హోటల్‌లో బస చేసిన ఆమెను అరెస్టు చేసినట్లు పూణే పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమెను పూణెకు తీసుకువస్తున్నారు. వివాదాస్పద అధికారి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో భూవివాదానికి సంబంధించి మనోరమ చేతిలో తుపాకీతో కొందరిని బెదిరించింది. ఈ వీడియో బయటకు రావడంతో మనోరమ, ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, ‘మేము ఆమెను మహద్‌లోని ఒక హోటల్ నుండి అదుపులోకి తీసుకున్నాము. ప్రస్తుతం పూణే తీసుకువస్తున్నారు. ఆమెను విచారించనున్నారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత తనను అరెస్ట్ చేయనున్నారు. ఈ కేసులో మనోరమ, ఆమె భర్త , మరో ఐదుగురు నిందితుల కోసం అనేక బృందాలు ఏర్పాటయ్యాయి.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ అరెస్టు !
الخميس، 18 يوليو 2024
maharashtra national pune ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ అరెస్టు మనోరమ
ليست هناك تعليقات:
إرسال تعليق