ఆంధ్రప్రదేశ్ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం నవీ ముంబైలో పర్యటించింది. మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు నవీన్, సూర్య సాయి ప్రవీణ్ చంద్‌లు ఈ పర్యటనకు వెళ్లారు. సిడ్కో అధికారులతో కలిసి నవీ ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది. నవీ ముంబై నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఉన్న సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. నవీ ముంబై నగర ప్రణాళికలు, అభివృద్ధిలో సిడ్కో పాత్ర చాలా కీలకమైనది. మంత్రి నారాయణ బృందం నవీ ముంబైలో రోడ్ నెట్ వర్క్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై అధ్యయనం చేసింది. నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ప్రభావిత నోటిఫైడ్ ఏరియాలో బృందం పర్యటించింది. ఆ తర్వాత సిడ్కో అధికారులతో సమావేశమైంది. అక్కడి హౌసింగ్ స్కీమ్స్, ఆర్థిక ప్రణాళికలు, అభివృద్ధి ప్రణాళికలు గురించి సిడ్కో అధికారులు వివరించారు. నవీ ముంబై అభివృద్ధిపై సిడ్కో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
నవీ ముంబైలో ఏపీ మంత్రి నారాయణ బృందం పర్యటన !
الأربعاء، 31 يوليو 2024
Andhra Pradesh ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై అధ్యయనం నవీ ముంబైలో ఏపీ మంత్రి నారాయణ బృందం పర్యటన రోడ్ నెట్ వర్క్ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్య భూమిక
ليست هناك تعليقات:
إرسال تعليق