ఆంధ్రప్రదేశ్ లోని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ ఒత్తిడి చేడంతోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కొట్టడమే కాకుండా హత్యాయత్నం కూడా చేశారని తెలిపారు. ఐపీఎస్ సీతా రామాంజనేయులు, అప్పటి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ పైనా కేసు బుక్ అయింది. ఈ నేపథ్యంలో సునీల్‌కుమార్ (A1), ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (A2), వైఎస్ జగన్ (A3), అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్ (A4), గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి (A5)పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురిచేయడం తదితర అంశాలకు సంబంధించిన పలు సెక్షన్లు వీరిపై పెట్టారు. వీటిలో బెయిల్‌బుల్, నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి.
వైఎస్ జగన్‌పై కేసు నమోదు !
الجمعة، 12 يوليو 2024
Andhra Pradesh ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు వైఎస్ జగన్‌పై కేసు నమోదు సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
ليست هناك تعليقات:
إرسال تعليق