సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతోన్న అనర్హులకు నోటీసులివ్వడంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, త్వరలోనే అర్హులే లబ్ధి పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించింది. మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని సీఎస్ శాంతి కుమారి అధికారులకు సూచించారు. అనర్హులకు లబ్ధి, రికవరీపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉండే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగమవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు సైతం 'ఆసరా' పొందుతున్నట్లు వెల్లడైంది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దు !
الأحد، 14 يوليو 2024
telangana మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతోన్న అనర్హులకు సీఎస్ శాంతి కుమారి అధికారులకు సూచించారు
ليست هناك تعليقات:
إرسال تعليق