తెలంగాణ ప్రభుత్వం సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి ఆర్థిక తోడ్పాటును అందించేందుకు 'రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ను శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద ఎంపికైన పేద అభ్యర్థులకు ఒక లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. సింగరేణి సంస్థ ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్న ఆయన నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని చెప్పారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. "గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం... డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశాం. ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం" అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ లో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి రూ. లక్ష ఆర్థిక సాయం !
السبت، 20 يوليو 2024
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో ప్రారంభించారు తెలంగాణ లో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి రూ. లక్ష ఆర్థిక సాయం రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం సీఎం రేవంత్‌రెడ్డి
ليست هناك تعليقات:
إرسال تعليق