మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ వాడే వారికి హెచ్చరిక !


కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ జులై 5న ఈ హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్‌లో డెనియల్ ఆఫ్ సర్వీస్, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్, సెక్యూరిటీ బైపాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని హెచ్చరించింది. హ్యాకర్లు డెనియల్ ఆఫ్ సర్వీస్ ఉపయోగించి బ్రౌజర్‌ను ఓవర్‌లోడ్ చేయవచ్చు, దీని వల్ల యూజర్ వెబ్‌సైట్స్‌ను యాక్సెస్ చేయలేరు. రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్  ద్వారా డివైజ్‌లోకి మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. తద్వారా డేటాను దొంగిలించవచ్చు లేదా డివైజ్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు. సెక్యూరిటీ బైపాస్ చేసి డివైజ్‌లోకి యాంటీవైరస్, ఫైర్‌వాల్ వంటి సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను స్కిప్ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (క్రోమియం-బేస్డ్) యూజర్లు డాన్, స్విఫ్ట్‌షేడర్‌లో 'యూజ్ ఆఫ్టర్ ఫ్రీ' సమస్య కారణంగా రిస్క్‌లో పడ్డారు. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌పేజీ విజిట్ చేయమని యూజర్లను ఒప్పించి మోసం చేసుకోవచ్చని CERT-In వార్నింగ్ వెల్లడించింది. అయితే కేవలం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొన్ని వెర్షన్ల యూజర్లు మాత్రమే ఈ సెక్యూరిటీ ఇష్యూతో ప్రభావితం అవుతారు. 126.0.2592.81 కంటే ముందున్న స్టేబుల్ వెర్షన్లు ఈ సమస్య వల్ల ప్రమాదంలో ఉన్నాయి. ఈ వెర్షన్లలో ఒకదాన్ని ఉపయోగిస్తుంటే, వెంటనే మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.మైక్రోసాఫ్ట్ ఈ సమస్యకు సంబంధించిన సెక్యూరిటీ అప్‌డేట్ విడుదల చేసింది. పీసీ, ఇతర డివైజెస్‌లో ఎడ్జ్ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్ మెనూపై క్లిక్ చేయాలి. ఆప్షన్స్ నుంచి "హెల్ప్ అండ్ ఫీడ్‌బ్యాక్" సెలక్ట్ చేయాలి. తర్వాత "అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్" ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. కొత్త వెర్షన్ అందుబాటులో ఉంటే, బ్రౌజర్‌ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. న్యూ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయాలి. అప్‌డేట్ చేసుకున్న తర్వాత కూడా సార్లు అప్రమత్తంగా ఉండాలి. అన్‌నోన్ సెండర్స్ నుంచి వచ్చిన ఈ-మెయిల్స్‌ లేదా అటాచ్‌మెంట్లపై క్లిక్ చేయకూడదు.

Post a Comment

0 Comments